హలో గురూ..నీకు సాటెవ్వరూ!
గురు గ్రహం
గురు గ్రహం
* భూమికీ గురు గ్రహానికీ మధ్య దూరం 588 మిలియన్ కిలోమీటర్లు.
* సూర్యుడికీ దీనికీ మధ్య దూరమైతే 778.5 మిలియన్ కిలోమీటర్లు.
స్పేసీ: అదిగదిగో గురుగ్రహం. ఎంత పెద్దగా ఉందో చూడూ! మనం దానిమీదే దిగుతున్నామిప్పుడు.
చిన్ను: జాగ్రత్తగా దిగు టామీ. స్పేసీ! ఇదేంటి ఇది కూడా భలేగా మెరిసిపోతోంది!
స్పేసీ: గ్రహాల్లో శుక్రుడి తర్వాత ఇదే కాంతివంతమైనది. అందుకే ఇలా వెలిగిపోతోంది. సూర్యుడి నుంచి లెక్కపెడితే ఇది ఐదోది. అందుకే ఇది మీ భూమి మీదకూ చుక్కలా కనిపిస్తుంటుంది.
చిన్ను: మా భూమికి దగ్గరగా ఉండేది మార్స్ కదా. దాని తర్వాతేగా ఇదుంటుంది. మరి ఇదెలా కనిపిస్తుంది?
స్పేసీ: గ్రహాలన్నింట్లో ఇదే పేద్దది కదా. అందుకే అంత దూరాన్నున్నా మీ కళ్లకు నేరుగా కనిపించేస్తుంది.
చిన్ను: నిజంగా చిత్రమేనే. దీన్నే బృహస్పతి అనీ, ఇంగ్లిష్‌లో అయితే జుపిటర్ అనీ అంటారు కదా. నాకు మానాన్న చెప్పార్లే. ఇంతకీ ఇది మా భూమి కంటే చాలా పెద్దదేనంటావా?
స్పేసీ: అయ్యో! మీ పదకొండు భూమిల్ని వరుసగా గుండ్రంగా పేర్చుకుపోతే ఈ గ్రహం అవుతుంది.
చిన్ను: హయ్యబాబోయ్!
స్పేసీ: అవునూ. ఇంకా ఆశ్చర్యపోయే విషయం చెప్పనా. మీ భూమిలాంటివి 318 కలిస్తే దీనంత బరువుంటాయి.
చిన్ను: అయితే ఇది మహా పెద్దదన్నట్లే. సూర్యుడి చుట్టూ అంతే ఫాస్ట్‌గా తిరిగేసొస్తుందా?
స్పేసీ: అలా అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్లే. ఇది ఆకారంలో పెద్దదిగానీ సూర్యుడి చుట్టూ తిరగడంలో మాత్రం నత్తే. ఒక్కసారి చుట్టు తిరిగి రావడానికి ఏకంగా 11.8ఏళ్లు పడుతుంది! అదే పనిని మీ భూమి 365రోజుల్లో చేసేస్తుందిగా.
చిన్ను: అలాగైతే దాని చుట్టూ అది ఇంకెంత కాలంలో తిరుగుతుందో ఏమో!
స్పేసీ: నువ్వు మళ్లీ పప్పులో కాలేశావ్. హ్హ.. హ్హ! మీకు ఒక రోజంటే 24 గంటలు. మరదే ఇక్కడైతే తొమ్మిది గంటల 56నిమిషాలే. అంటే ఇది ఒక్కసారి దాని చుట్టూ అది ఈ కొన్ని గంటల్లోనే తిరిగేస్తుందన్నమాట. అతి తక్కువ సమయం ఉన్న రోజు ఈ గ్రహంలోదే.
చిన్ను: బాగానే ఉంది. ఈ స్పేస్‌సూట్‌తో నాకంతా గాబరాగా ఉంది. కాసేపు తీసేయ్‌నా?
స్పేసీ: లేదు లేదు. తీసేస్తే నువ్వు ఊపిరి పీల్చుకోలేవు. ఇక్కడ వాతావరణంలో 90శాతం హైడ్రోజన్. మిగిలింది హీలియం. కొన్ని స్పేస్ గ్యాస్‌లూ ఉంటాయి. సూర్యుడిలోనూ ఇంచుమించు ఇలాంటి వాతావరణమే ఉంటుంది.
చిన్ను: హుమ్! ఏదో తేడా తెలుస్తోంది నాక్కూడా. మా టామీ కూడా ఎగురుతుంటే చాలా వేగంగా కింద పడిపోతోందేంటో.
స్పేసీ: ఇక్కడి నేల ఎక్కువగా రాళ్లు, లోహాలు, హైడ్రోజన్ బంధాలతో ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే ఎక్కువ. అందుకే టామీ వేగంగా కిందకి పడుతోంది.
చిన్ను: స్పేసీ! స్పేసీ! అటు చూడు దూరంగా అక్కడేదో మచ్చలా కనిపిస్తోంది.
స్పేసీ: అదా.. దాన్నే ‘ద గ్రేట్ రెడ్ స్పాట్’ అని పిలుస్తారు. ఇది ఇక్కడున్న అధిక పీడన ప్రాంతం. 350 ఏళ్లుగా ఈ ప్రాంతం ఇలాగే ఉంది. అది ఎంత పెద్దదంటే దాంట్లో మూడు భూములు పట్టేస్తాయి. అందుకే మీరు భూమి నుంచి టెలిస్కోపుతో చూస్తున్నా ఇది మచ్చలా కనిపిస్తుంటుంది.
చిన్ను: ఏంటో ఇక్కడ అడుగడుగునా చిత్రమే. ఓ వైపు అప్పుడే చీకటి పడిపోతోంది. చూడూ! ఎవరో ఇక్కడ ఆకాశం అంతా లైట్లు పెట్టారు.
స్పేసీ: హ్హ.. హ్హ..హ్హ! అవి లైట్లు కాదు చిన్నూ చందమామలు.
చిన్ను: ఇన్ని చందమామలుంటాయా ఎక్కడైనా. నమ్ముతున్నానని ఏదైనా చెప్పేస్తున్నావు నువ్వు?
స్పేసీ: నిజంగానే నిజం. దీనికి ఏకంగా 67 చందమామలున్నాయి. వీటిలో పెద్దవి నాలుగు. 1610లో వాటిని మీ శాస్త్రవేత్త గెలీలియో గుర్తించారు. అందుకే ఆ నాలుగింటినీ గెలీలియన్ మూన్స్ అంటారు.
చిన్ను: మా శాస్త్రవేత్తనా. భలేభలే. ఆయనా ఇక్కడకు వచ్చారా ఏంటీ?
స్పేసీ: రాలేదు. టెలిస్కోపుల ద్వారా పరిశోధనలు చేసి కనిపెట్టార్లే. మీ వాళ్లెవరూ ఇక్కడికి రాలేదు గానీ మీరు వదిలిన ఎనిమిది స్పేస్ క్రాఫ్ట్‌లు వచ్చాయిక్కడకి.
చిన్ను: వాటి తర్వాత నేనే ఇక్కడికి వచ్చిందన్నమాట. అబ్బ ఎంత ఆనందంగా ఉందో! అది సరే. రేపు మన ప్రయాణం ఎక్కడికి..?
స్పేసీ: ఎక్కడికంటే...? నేను అప్పుడే చెప్పనుగా!

No comments:
Post a Comment